Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

తెలుగు వికీపీడియా గురించి మరింత అవగాహన కొరకు వికీపీడియా గురించి మీకు తెలుసా? ఈ బొమ్మపై నొక్కి తెలుగు వికీపీడియాను పరిచయం చేసే పుస్తకం చూడండి.

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,12,847 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
బేరెంట్స్ సముద్రం

బేరెంట్స్ సముద్రం ఆర్కిటిక్ మహాసముద్రపు ఉపాంత సముద్రం. ఇది నార్వే, రష్యాల ఉత్తర తీరాలలో ఉంది. ఈ రెండు దేశాల ప్రాదేశిక జలాల మధ్య ఇది విభజించబడింది. మధ్య యుగాలలో రష్యాలో దీన్ని ముర్మాన్ సముద్రం ("నార్స్ సముద్రం") అని పిలిచేవారు. ప్రస్తుత పేరు చారిత్రక డచ్ నావికుడైన విల్లెం బేరెంట్స్ పేరు మీద వచ్చింది. ఇది పెద్దగా లోతులేని సముద్రం - సగటు లోతు 230 మీటర్లు (750 అ.) ఉంటుంది. ఇది చేపలవేటకు, చమురు, గ్యాసుల అన్వేషణకూ ముఖ్యమైన ప్రదేశం. బేరెంట్స్ సముద్రానికి దక్షిణాన కోలా ద్వీపకల్పం, పశ్చిమాన నార్వేజియన్ సముద్రపు షెల్ఫ్ అంచు, వాయవ్యంలో స్వాల్‌బార్డ్ ద్వీపసమూహాలు, ఈశాన్యంలో ఫ్రాంజ్ జోసెఫ్ ల్యాండ్, తూర్పున నోవాయా జెమ్లియాలు సరిహద్దులుగా ఉన్నాయి. నోవాయా జెమ్లియా ద్వీపాలు, కారా సముద్రం నుండి బేరెంట్స్ సముద్రాన్ని వేరు చేస్తాయి. ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగమైనప్పటికీ, బేరెంట్స్ సముద్రం " అట్లాంటిక్‌గా మారుతోంది" లేదా "అట్లాంటిఫై" అయ్యే ప్రక్రియలో ఉంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వస్తున్న హైడ్రోలాజికల్ మార్పులు సముద్రపు మంచు తగ్గడానికి, నీటి స్తరీకరణకూ దారితీశాయి. ఇది యురేషియాలో వాతావరణంలో పెద్ద మార్పులను సృష్టించగలదు. బేరెంట్స్ సముద్రంలో శాశ్వత మంచు రహిత ప్రాంతం పెరిగేకొద్దీ పెరిగే అదనపు బాష్పీభవనం, ఐరోపా ఖండంలో చాలా ప్రాంతాల్లో శీతాకాలపు హిమపాతం పెరుగుతుందని ఒక అంచనా.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... దర్శకుడు తిరుపతి స్వామి తీసిన మొదటి సినిమా గణేష్ ఐదు నంది పురస్కారాలు దక్కించుకున్నదనీ!
  • ... పుట్టపర్తి నారాయణాచార్యులు రాసిన రచనల్లో ఆయనకు అత్యంత ఖ్యాతి తెచ్చిన పుస్తకం శివతాండవ కావ్యం అనీ!
  • ... తెలుగు నటి వడ్డీ మహేశ్వరి కూచిపూడి లో నాట్యం లో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించినందనీ!
  • ... బసంతి దేవి కళాశాల కోల్‌కత లో ఆ రాష్ట్రప్రభుత్వం స్థాపించిన మొదటి ప్రాయోజిత మహిళా కళాశాల అనీ!
  • ... పత్తితో తయారయ్యే సాంప్రదాయిక వరంగల్ తివాచీలు మొఘలాయిల సైన్యం దక్కన్ ప్రాంతంలో ప్రవేశించినప్పటి నుంచీ ప్రాచుర్యం పొందాయనీ!
చరిత్రలో ఈ రోజు
మే 17:
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.